దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనాభా లెక్కల సేకరణ చేపట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2027 జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునేందుకు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) అవకాశం కల్పించనుంది.
ఎన్నికలు జరగనున్న గోవా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపుర్, ఉత్తరాఖండ్‌తో పాటు హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లోని మంచు కురిసే ప్రాంతాలు, లద్దాఖ్‌కు ఈ షెడ్యూల్ నుంచి మినహాయింపు ఇచ్చింది.