2027-28 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో ప్రముఖ ఆర్థికవేత్తలతో ప్రీ-బడ్జెట్ సమావేశం నిర్వహించారు. దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, వృద్ధి రేటును పెంచేందుకు తీసుకోవాల్సిన వ్యూహాత్మక చర్యలు, బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాబోయే రోజుల్లో పారిశ్రామికవేత్తలు, రైతు సంఘాలు, వివిధ రంగాల నిపుణుల నుంచి కూడా సలహాలను ప్రభుత్వం స్వీకరించనుంది.