100% ఇథనాల్‌తో నడిచే ఈ-100 వాహనాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మోటార్ వెహికల్స్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. అయితే ఈ-85, ఈ-100 వాహనాలకు అనుకూలమైతేనే ఈ ఇంధనాన్ని వాడాలని, ఈ-20 వాహనాలకు ఆ పెట్రోల్ కరెక్ట్ కాదని స్పష్టం చేసింది. అలాగే లైట్ పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఉన్న వెయిట్ లిమిట్‌ను 3 వేల నుంచి 3,500కు పెంచింది.