వంట నూనెలపై సుంకాలు తగ్గించిన కేంద్రం

26చూసినవారు
వంట నూనెలపై సుంకాలు తగ్గించిన కేంద్రం
వంట నూనె ధరలు తగ్గుదలపై ప్రభావం చూపేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ముడి, రిఫైన్డ్‌ వంట నూనెలపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ (BCD)ని తగ్గించింది. ముడి సోయాబీన్‌, పామ్‌ ఆయిల్స్‌పై సుంకాన్ని 10% నుంచి 5%కి, రిఫైన్డ్‌ సోయాబీన్‌, పామ్‌ ఆయిల్స్‌పై 32.7% నుంచి 27.5%కి తగ్గించింది. ముడి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై 10% సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై BCDని 32.5% నుంచి 22.5%కి తగ్గించింది. కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్