
ఎక్స్ యూజర్లకు గుడ్ న్యూస్... ఇకపై ఒకే పోస్టులో 20 ఫొటోలు
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సంస్థ ‘ఎక్స్’ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఒకే పోస్టులో 20 ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు కేవలం నాలుగు ఫొటోలు మాత్రమే పోస్టు చేసే వీలుండేది. సుదీర్ఘకాలం పాటు ఈ పరిమితి కొనసాగుతుండగా.. తాజాగా ఆ సంఖ్యను ఎక్స్ పెంచింది.




