ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనల ప్రకారం పీఎఫ్ అడ్వాన్స్ విత్డ్రా నిబంధనలు సరళీకృతమయ్యాయి. గతంలోని 13 కేటగిరీల స్థానంలో మూడు ప్రధాన విభాగాలను తీసుకొచ్చారు. కనీసం 12 నెలల పీఎఫ్ సభ్యత్వం పూర్తయితే అర్హతను బట్టి ఖాతాలోని మొత్తం నిల్వలో 75% వరకు అడ్వాన్స్గా తీసుకునే అవకాశం ఉంటుంది. వైద్య అత్యవసరాల కోసం ఎన్నిసార్లయినా విత్డ్రా చేసుకోవచ్చు. విద్య కోసం సర్వీసులో గరిష్ఠంగా 10 సార్లు, సొంత లేదా పిల్లల వివాహాలకు 5 సార్లు, ఇల్లు, ప్లాట్, నిర్మాణం, మరమ్మతులు, హోమ్లోన్ చెల్లింపులకు 5 సార్లు వరకు అడ్వాన్స్ పొందవచ్చు.