బాలీవుడ్లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. గ్లోబల్ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకుని రూపొందించే ఇంగ్లిష్ వెర్షన్లో కొన్ని మార్పులు చేయనున్నట్లు సమాచారం. హిందీ వెర్షన్తో పోలిస్తే ఇంగ్లిష్ వెర్షన్ను దాదాపు 30 నిమిషాలు తక్కువ నిడివితో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొన్ని పాటలతో పాటు, అంతర్జాతీయ ప్రేక్షకుల కథనానికి అనుగుణంగా కొన్ని సన్నివేశాలను కూడా తొలగించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.