
వృద్ధ దంపతులను ఢీకొన్న కారు (సీసీటీవీ వీడియో)
ఢిల్లీలోని కీర్తి నగర్లో ఓ వృద్ధ దంపతులను శుక్రవారం అర్థరాత్రి ఎస్యూవీ కారు ఢీకొట్టింది. ఆర్య సమాజ్ మందిర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కారును నడుపుతున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన 71 ఏళ్ల కుసుమ్ టాగ్రా, 79 ఏళ్ల ఆమె భర్త దయానంద్ టాగ్రా ప్రస్తుతం కల్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ వ్యవహరించిన తీరు కూడా సీసీటీవీలో రికార్డైంది.




