
కూతురికి లొకేషన్ షేర్ చేసి.. తండ్రి ఆత్మహత్య
TG: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్‌లో శనివారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో పనిచేసే వెంకా గౌరీ నరసింహులు గౌడ్ (45) అప్పుల భారంంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం తన స్వగ్రామానికి వెళ్తానని చెప్పి బయలుదేరిన నరసింహులు.. తిమ్మాపూర్ అటవీ ప్రాంతానికి చేరుకుని తన కూతురికి లైవ్ లొకేషన్ పంపి 'బాయ్ అమ్ములు' అని మెసేజ్ చేశాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే వెతకగా.. చెట్టుకు వేలాడుతూ విగతజీవుడిగా కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




