TG: రంగారెడ్డి జిల్లా మణికొండలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున 3:20కి ఫ్లొటిల్లా అపార్ట్మెంట్స్లో ఆరుగురు అనుమానితులు చొరబడ్డారు. లేక్సైడ్ ఫెన్సింగ్ కత్తిరించి C బ్లాక్ ఫ్లాట్లో చోరీ చేశారు. అడ్డుకున్న నివాసిపై ఆయుధాలతో దాడికి యత్నించారు. పోలీసులు CCTV ఫుటేజీ పరిశీలిస్తున్నారు. నాలాలు, లేక్సైడ్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.