భారీగా పెరగనున్న చికెన్, గుడ్ల ధరలు

29చూసినవారు
భారీగా పెరగనున్న చికెన్, గుడ్ల ధరలు
రానున్న రోజుల్లో గుడ్లు, చికెన్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. పౌల్ట్రీ వ్యాపారుల అంచనా ప్రకారం డిసెంబర్ 2026 నాటికి ధరలు 25-30 శాతం వరకు పెరగవచ్చు. కోళ్ల మేత తయారీలో ఉపయోగించే మొక్కజొన్న, నూకల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం గుడ్డు టోకు ధర రూ.6-7 ఉండగా డిసెంబర్ నాటికి రూ.7-8కు చేరవచ్చని అంచనా. చర్మం లేని చికెన్ కిలో రూ.225-250 నుంచి రూ.260-275కు పెరగవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిమాండ్ పెరగడం కూడా ధరలపై ప్రభావం చూపనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్