తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. గడిచిన వారంతో పోలిస్తే కిలోకు రూ.30 నుంచి రూ.40 వరకు ధరలు పెరిగినట్లు సమాచారం. హైదరాబాద్‌లో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.300-320గా నమోదు కాగా, నిజామాబాద్‌లో రూ.270-300, విజయవాడలో రూ.280, నంద్యాలలో రూ.230-260, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో రూ.280-300 వరకు విక్రయిస్తున్నారు. చికెన్ ధరల పెరుగుదల వినియోగదారులకు భారంగా మారింది.