చిన్నారి హత్య.. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్

8చూసినవారు
చిన్నారి హత్య.. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్
TG: హైదరాబాద్ బొల్లారంలోని ఆర్కిడ్ గేటెడ్ కమ్యూనిటీలో ఐదేళ్ల చిన్నారి మోజెస్ అరేలియాను హత్య చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై బాలిక బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు విక్రమ్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా, అతడిని బహిరంగంగా ఉరి తీయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరో చిన్నారికి ఇలాంటి పరిస్థితి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా గతంలో జరిగిన గొడవల నేపథ్యంలో విక్రమ్ ఆ చిన్నారిని చంపేసినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్