
పంచకం ప్రారంభం.. అన్ని శుభకార్యాలు బంద్!
హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అక్టోబర్ 21 బుధవారం ఉదయం 7:22 గంటల నుంచి అక్టోబర్ 25 ఆదివారం సాయంత్రం 7:22 వరకు పంచకం కొనసాగుతుంది. ఈసారి బుధవారం ప్రారంభం కావడంతో ఇది 'సాధారణ పంచకం'గా పరిగణించబడుతుంది. ఈ సమయంలో దక్షిణ దిశ ప్రయాణాలు, ఇంటి పైకప్పు నిర్మాణం, కట్టెల సేకరణ, మంచం నేయడం వంటి పనులకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఏదైనా శుభకార్యానికి ముందు కుటుంబ ఆచారాల ప్రకారం ముహూర్తాన్ని పరిశీలించుకోవాలని పండితులు సలహా ఇస్తున్నారు.




