
ఏపీలో రానున్న ఐదు రోజులపాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ
AP: ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడటంతో రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం నాటికి ఇది వాయుగుండంగా, 23వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వర్షాల తీవ్రత పెరగనుంది. ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.




