
ఏడాదిలో 110 సిక్సర్లు.. టీ20ల్లో భారత మహిళల ప్రపంచ రికార్డు
భారత మహిళా క్రికెట్ జట్టు టీ20ల్లో అరుదైన రికార్డు సృష్టించింది. ఒక క్యాలెండర్ ఇయర్లో 100కు పైగా సిక్సర్లు బాదిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. ఈ ఏడాది ఇప్పటివరకు భారత్ 110 సిక్సర్లు కొట్టింది. ఆసియా క్రీడల ఫైనల్లో శ్రీలంకపై భారత్ 13 సిక్సర్లు బాదింది. స్మృతి మంధాన 7, రిచా ఘోష్ 3, షఫాలీ వర్మ 3 సిక్సర్లు కొట్టారు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా 77, పాకిస్థాన్ 63 సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.




