తెలంగాణలో మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు?

4చూసినవారు
తెలంగాణలో మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు?
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 18 నుంచి నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ రూపొందించింది. ప్రభుత్వ ఆమోదం కోసం పంపగా, సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తర్వాత అధికారికంగా విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 10తో పరీక్షలు ముగియనున్నాయి. దాదాపు 5.25 లక్షల నుంచి 5.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మరోవైపు, పదో తరగతి మార్కుల మెమోలో పేరు, పుట్టిన తేదీ వంటి తప్పుల సవరణకు ఇకపై మీ సేవా పోర్టల్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది.

సంబంధిత పోస్ట్