వచ్చే ఏడాది నుంచి బడుల్లోనే 11, 12 తరగతులు

54చూసినవారు
వచ్చే ఏడాది నుంచి బడుల్లోనే 11, 12 తరగతులు
ప్రస్తుతం 10వ తరగతి తర్వాత జూనియర్ కళాశాలల్లో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ విద్యను, పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకు ఒకే వ్యవస్థలో చదువుకునే అవకాశం కలుగుతుంది. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఇప్పటికే 12వ తరగతి వరకు పాఠశాల విద్యా విధానం అమల్లో ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అయితే దీని అమలుకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను సిద్ధం చేయాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్