విద్యార్థితో బలవంతంగా పురుగుల మందు తాగించిన క్లాస్‌మేట్స్

37చూసినవారు
విద్యార్థితో బలవంతంగా పురుగుల మందు తాగించిన క్లాస్‌మేట్స్
AP: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం గ్రామంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. తోటి ఇద్దరు విద్యార్థులు బాధితుడితో బలవంతంగా పురుగుల మందు తాగించారు. ఇంటికి వెళ్లాక అస్వస్థతకు గురైన బాధితుడిని కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం చెన్నై తరలించగా, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి ర్యాగింగ్ కోణంలో విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్