CM ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ స్కీమ్​​.. ఉత్తర్వులు జారీ

36చూసినవారు
CM ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ స్కీమ్​​.. ఉత్తర్వులు జారీ
తెలంగాణ ప్రభుత్వం విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్లే నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా 'సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ స్కీమ్'ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తొలి ఏడాదిలో దాదాపు 7 వేల మంది యువతకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా భాషా శిక్షణ, వీసా ఫీజు, విమాన ప్రయాణ ఖర్చులకు 50 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. మహిళలకు 33.33 శాతం, దివ్యాంగులకు 5 శాతం కోటాను కేటాయించారు. ఈ పథకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వం తాజాగా జారీ చేసింది.

సంబంధిత పోస్ట్