TG: సీఎం రేవంత్ రెడ్డి శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి అంశాలపై
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆదివారం భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలు, ఇతర అంశాలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. అలాగే పెండింగ్ నిధులు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో రేవంత్ సమావేశమయ్యే ఛాన్సుంది.