TG: సీఎం రేవంత్ ఆదివారం ప్రధాని మోదీని కలవనున్నారు. మంత్రి ఉత్తమ్‌తో కలిసి ప్రధానితో భేటీ అవుతారు. రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులను ప్రధానికి వివరించనున్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని ఆర్థిక సాయం కోరనుంది. ఈ సమావేశంలో మరిన్ని కీలక విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.