TG: సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు కోడంగల్ పర్యటన కొనసాగుతోంది. ఆదివారం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొడంగల్లో బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువజన
కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం హకీంపేటకు బయలుదేరి వెళ్లారు.