తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చెన్నైలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్వయంగా టిఫిన్ వడ్డించారు. 6-8 తరగతులకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని విస్తరించే కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి కింద కూర్చుని టిఫిన్ చేశారు. ఆహార నాణ్యతను పరిశీలించి, రుచి గురించి పిల్లలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఆయన సరదాగా గడిపిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.