
‘అర్నబ్’ అంటే ఏమిటి? తుపాను పేరు వెనుక ఆసక్తికరమైన కథ
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపానుకు ‘అర్నబ్’ అని పేరు పెట్టారు. బెంగాలీ భాషలో అర్నబ్ అంటే సముద్రం లేదా మహాసముద్రం అని అర్థం. ఈ పేరును బంగ్లాదేశ్ సూచించింది. ప్రపంచ వాతావరణ సంస్థ, ఐరాస ఆర్థిక, సామాజిక కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలోని 13 దేశాలు తుపాన్ల పేర్ల జాబితాను రూపొందిస్తాయి. ఈ జాబితా నుంచి వరుస క్రమంలో తుపాన్లకు పేర్లు కేటాయిస్తారు.




