పంజాబ్లోని పాటియాలా-సంగ్రూర్ రహదారిపై భాక్రా కాలువ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ నిర్మించిన ఇనుప వంతెన అకస్మాత్తుగా కుప్పకూలడంతో, దానిపై వెళ్తున్న రెండు భారీ లారీలు కాలువలో పడి మంటల్లో చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక, సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. వారు మంటలను అదుపులోకి తీసుకురావడంతో పాటు, కాలువలో చిక్కుకున్న ఇద్దరు లారీ డ్రైవర్లను సురక్షితంగా కాపాడారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది.