ఐదుగురిపైకి దూసుకెళ్లిన కాలేజీ బస్సు (వీడియో)

27చూసినవారు
పంజాబ్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఐదుగురు వ్యక్తులపైకి కాలేజీ బస్సు దూసుకెళ్లింది. లూథియానాలోని మాఛివాడా-కుహారా రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో స్కూటర్‌పై నుంచి ఓ వ్యక్తి కిందపడగా.. ఆయనను కాపాడేందుకు మరో నలుగురు వెళ్లారు. అదే సమయంలో వేగంగా  దూసుకొచ్చిన బస్సు వారిని ఢీకొట్టింది. నలుగురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్