తుమ్మిడిహట్టి' పై అధ్యయనానికి కమిటీ: రేవంత్ రెడ్డి

49చూసినవారు
తుమ్మిడిహట్టి' పై అధ్యయనానికి కమిటీ: రేవంత్ రెడ్డి
TG: తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తును పెంచే అంశంపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలవంతంగా సాగాయని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బ్యారేజీ వల్ల కలిగే సాంకేతిక మరియు ముంపు సమస్యలను పరిష్కరించేందుకు అధికారులతో కూడిన ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, ప్రజల జీవన ప్రమాణాలను మార్చేందుకు సహకరిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్