
రాజస్థాన్‌లో తల్లి, సోదరిని చంపి యువకుడు ఆత్మహత్య (VIDEO)
రాజస్థాన్‌లోని జైపూర్‌లో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. 27 ఏళ్ల లక్కీ అనే యువకుడు తన తల్లి సరోజా తివారీ (50), సోదరి శివాంగి (25) మధ్య తరచూ జరిగే గొడవలతో విసిగిపోయి వారిని హత్య చేశాడు. అనంతరం లక్కీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు నిందితుడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు సభ్యులు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




