భారత్-వెస్టిండీస్ మధ్య ఈనెల 14న ఉప్పల్లో జరగనున్న నాలుగో
టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలపై గందరగోళం నెలకొంది. వెబ్సైట్లో టికెట్లు అన్నీ అమ్ముడైపోయాయని చూపడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. ఇప్పటివరకు కేవలం 12 వేల టికెట్లే అమ్ముడయ్యాయని హైదరాబాద్
క్రికెట్ అసోసియేషన్ (HCA) చెబుతుండగా, జిని యాప్లో టికెట్ల విక్రయాలపై అభిమానులకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.