TG: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో దసరా పండుగ, సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా
కాంగ్రెస్ పార్టీలోని ప్రేమ్ సాగర్ రావు,
జగన్ మోహన్ రావు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇరు వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజకీయ వర్గాల మధ్య ఏర్పడిన ఈ ఆధిపత్య పోరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.