TG: హైడ్రాపై శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘గాజులరామారం సర్వే నెంబర్ 307లోని భూమిని చట్ట ప్రకారమే కొనుగోలు చేశాం. దీనిపై గతంలోనూ హైకోర్టులో పిటిషన్ వేశాం. హైడ్రా అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆ భూమిలోకి ప్రవేశించి ఫెన్సింగ్‌ను కూల్చేశారు’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైడ్రా తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.