లోక్‌సభలో
కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలకు త్రీ-లైన్ విప్‌ను జారీ చేసింది. పార్టీ లోక్‌సభ చీఫ్ విప్ కె.సురేష్ ఈ ఆదేశాలను జారీ చేశారు. దీని ప్రకారం.. పార్టీకి చెందిన ఎంపీలందరూ నవంబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని సూచించారు. ఈ కాలంలో సభలో చర్చకు వచ్చే అంశాలపై పార్టీ అనుసరిస్తున్న వైఖరికి మద్దతు తెలపాలని ఎంపీలను కోరారు.