TG: హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆదివారం
కాంగ్రెస్ పార్టీ 'మహాధర్నా' చేపట్టింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత
కేసీఆర్ తన ప్రతిపక్ష నేత పదవికి వెంటనే రాజీనామా చేయాలని
కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు
కేసీఆర్ హాజరుకావడం లేదని, ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించలేని పక్షంలో గజ్వేల్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని
కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ధర్నా ద్వారా బీఆర్ఎస్ వ్యూహాలకు కౌంటర్ ఇవ్వడంతో పాటు,
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా ముఖ్య ఉద్దేశం.