మేడిగడ్డను కాంగ్రెస్ వాళ్లే బాంబులతో పేల్చేశారు: KTR

57చూసినవారు
మేడిగడ్డను కాంగ్రెస్ వాళ్లే బాంబులతో పేల్చేశారు: KTR
TG: మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ నాయకులే బాంబులు పెట్టి పేల్చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ఇంజినీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. కానీ బ్యారేజీ కూలిపోయిందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రూ.4 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించామని, కేవలం రెండు పిల్లర్లను తొలగించి రూ.400 కోట్లతో కొత్తవి కట్టవచ్చని సూచించారు. దీనికి ఎల్ అండ్ టీ సంస్థ ముందుకొచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు.

సంబంధిత పోస్ట్