సీజ్ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టిన కానిస్టేబుల్

99చూసినవారు
సీజ్ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టిన కానిస్టేబుల్
TG: తండ్రి క్యాన్సర్ చికిత్స కోసం ఓ కానిస్టేబుల్ సీజ్ చేసిన బంగారాన్నే తాకట్టు పెట్టాడు. హైదరాబాద్ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రవణ్ ఓ కేసులో సీజ్ చేసిన ఫోన్ నుంచి రూ.1.70 లక్షలు అక్రమంగా బదిలీ చేసుకున్నాడు. మరో కేసులో సీజ్ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.12.37 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తన తండ్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్స కోసమే డబ్బులు తీసుకున్నానని శ్రవణ్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇటీవల ఆయన తండ్రి మరణించినట్లు తెలుస్తోంది. అక్రమాలు వెలుగులోకి రావడంతో శ్రవణ్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్