
రైల్వే అండర్పాస్లోకి వాన నీరు.. చిక్కుకున్న బస్సులు
AP: నెల్లూరులో శనివారం కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఆత్మకూరు బస్టాండ్, విజయమహల్ గేట్, మాగుంట లేఅవుట్ వంతెనల కింద భారీగా నీరు నిలిచిపోయింది. ఆత్మకూరు బస్టాండ్ రైల్వే అండర్పాస్ వద్ద వరద నీటిలో రెండు ప్రైవేట్ బస్సులు చిక్కుకుపోవడంతో, వాటిని బయటకు తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్లపై వాన నీటితో పాటు మురుగు నీరు కూడా చేరడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో కొందరు వాటర్ పైపులపై నడుస్తూ ప్రయాణిస్తున్నారు.




