వంట మనిషిని కత్తితో పొడిచి చంపిన సహోద్యోగి (VIDEO)

25చూసినవారు
TG: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి హరిహర మెన్స్ హాస్టల్‌లో పనిచేస్తున్న శశిధర్‌ను తోటి ఉద్యోగి ప్రమోద్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడు ప్రమోద్ కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు హాస్టల్ యాజమానితో పాటు నివాసితులను విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్