వంటగ్యాస్‌ బుకింగ్‌ గడువు తగ్గింపు

0చూసినవారు
వంటగ్యాస్‌ బుకింగ్‌ గడువు తగ్గింపు
వంటగ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్.  గ్రామీణ ప్రాంతాల్లో వంటగ్యాస్‌ బుకింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. రీఫిల్‌ సిలిండర్‌ బుకింగ్‌కు ఉన్న 45 రోజుల గడువును 25 రోజులకు తగ్గించినట్లు కేంద్ర మంత్రి సురేశ్‌ గోపీ వెల్లడించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు గతంలో కంటే ముందుగానే తదుపరి సిలిండర్‌ను బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. గ్యాస్‌ సరఫరా, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్