కుమారుడితో సహా దంపతులు ఆత్మహత్య

11చూసినవారు
కుమారుడితో సహా దంపతులు ఆత్మహత్య
TG: హైదరాబాద్‌ గచ్చిబౌలిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. గచ్చిబౌలి గోపన్నపల్లిలోని జయభేరి అపార్ట్‌మెంటులో ఈ ఘటన జరిగింది. కుమారుడితో పాటు దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనారోగ్య కారణాలతో వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్