
ఢిల్లీలో 10,000 మంది విద్యార్థులకు కొత్త హాస్టళ్లు: సీఎం రేఖా గుప్తా
ఢిల్లీలోని సత్య నికేతన్ హాస్టల్ కూలిన ఘటన అనంతరం విద్యార్థుల భద్రతపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10,000 మంది విద్యార్థుల కోసం సురక్షితమైన, అందుబాటు ధరల్లో హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. దీనికోసం స్థలాల అన్వేషణ ఇప్పటికే ప్రారంభమైంది. మున్సిపల్ తనిఖీల్లో సురక్షితం కాదని తేలిన 34 హాస్టల్ భవనాలను అధికారులు ఇప్పటికే కూల్చివేయగా, మరో 17 హాస్టళ్లను సీల్ చేశారు.




