
దేశ ప్రజలు గమనిస్తున్నారు: ప్రకాశ్ రాజ్
డీలిమిటేషన్ బిల్లుపై నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా స్పందించారు. ‘ఆరు నెలల క్రితం పార్లమెంట్లో వీగిపోయిన డీలిమిటేషన్ బిల్లు.. ఇప్పుడు ఎలా ఆమోదం పొందబోతోంది. ఈ ఆరు నెలల్లో ఏం ఆట ఆడారు? తమకు వ్యతిరేకంగా ఓటేసిన ఎంపీలను కొనుగోలు చేసి.. చిన్న పార్టీలో చేర్చుకుని ఓట్లు పొందారు. కొందరు ఎంపీలను కొనుగోలు చేశారు. మరికొందరిని కేసులతో బెదిరించారు. దేశ ప్రజలు ఈ నాటకాన్ని గమనిస్తున్నారు’ అని అన్నారు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.




