టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌ను రింకూ సింగ్ వివాహం చేసుకోనున్నారు. డిసెంబర్ 4న లక్నోలో వీరి వివాహ వేడుక జరగనుంది. పెళ్లి పత్రికలు ఇప్పటికే ప్రింట్ అయ్యాయి. ఏర్పాట్లను రింకూ దగ్గర ఉండి చూసుకుంటున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. కాగా, ప్రియ సరోజ్ 2024 ఎన్నికల్లో మచిలీషహర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.