
ఏడాదికి రూ.12 వేలు.. నవంబర్ 15 వరకు మాత్రమే అవకాశం
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) కోసం దరఖాస్తు చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ విద్యా సంవత్సరం కోసం అక్టోబర్ 27తో గడువు ముగియగా, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా నవంబర్ 15 వరకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు ఏటా రూ.12,000 ఆర్థిక సాయం అందుతుంది.




