ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


తాగునీటితో ఫ్లోర్‌ క్లీనింగ్‌ చేశారని రూ.20 వేల జరిమానా
Nov 08, 2026, 06:11 IST/

తాగునీటితో ఫ్లోర్‌ క్లీనింగ్‌ చేశారని రూ.20 వేల జరిమానా

Nov 08, 2026, 06:11 IST
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలో తాగునీటిని దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించిన జలమండలి అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. అక్షయకల్ప ఫార్మ్స్, ఫుడ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ తన ప్రాంగణంలో ఫ్లోర్‌ క్లీనింగ్‌ కోసం తాగునీటిని వాడుతున్నట్లు తేలడంతో.. ఆ సంస్థకు రూ. 20 వేల జరిమానా విధించడంతో పాటు, మురుగునీటి కనెక్షన్‌ను కూడా తాత్కాలికంగా తొలగించారు. తాగునీటిని అత్యవసరాలకు మాత్రమే వాడాలని, వృథాను అరికట్టేందుకు ఎవరైనా 99499 30003 నంబర్‌కు వివరాలు వాట్సప్ చేయవచ్చని అధికారులు సూచించారు.