దారుణం.. ఓ వ్యాపారవేత్తను తినేసిన మొసలి! (వీడియో)

12చూసినవారు
దక్షిణాఫ్రికాలో ఇటీవల సంభవించిన వరదల్లో గల్లంతైన వ్యాపారవేత్త గాబ్రియేల్‌ బాటిస్టా (59) మొసలి దాడిలో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. వరద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వంతెన పైనుంచి కారులో వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో ఆయన కనిపించకుండా పోయారు. డ్రోన్లతో గాలింపు చేపట్టిన అధికారులు.. ఆయన గల్లంతైన ప్రాంతంలో ఓ భారీ మొసలిని గుర్తించారు. పోలీసులు దాన్ని కాల్చి చంపి, హెలికాప్టర్‌ సాయంతో నీటిలో నుంచి బయటకు తీసుకొచ్చారు. మొసలి కడుపులో మానవ అవశేషాలతో పాటు బాటిస్టాకు చెందిన ఉంగరం లభించినట్లు సమాచారం. దీంతో అవి ఆయనవే అయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్