దారుణం.. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త!

13చూసినవారు
దారుణం.. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త!
TG: హైదరాబాద్‌లోని న్యూ శాంతినగర్‌లో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ దారుణ హత్యకు దారితీసింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ(M) బజనాతండాకు చెందిన జి.రాజశేఖర్(26) తన భార్య ప్రియాంక(22)పై అనుమానంతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి ప్రియాంక గొంతు నులిమి హత్య చేసి, దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రాజశేఖర్ ప్రయత్నించినట్లు సమాచారం. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్