అమెరికాలోని మిసిసిప్పి నదిలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నది ఒడ్డున నిలిపి ఉంచిన ఒక క్రూయిజ్ షిప్‌ను అదుపు తప్పిన ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో షిప్ పూర్తిగా నదిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. షిప్‌లో ఉన్న ప్రయాణికులు ప్రాణాలను కాపాడుకునేందుకు లైఫ్ జాకెట్లతో నీటిలోకి దూకారు. మరికొందరు షిప్‌తో పాటే నీటిలో చిక్కుకుపోయినట్లు సమాచారం. ప్రాణనష్టంపై అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు SMలో వైరల్ అవుతున్నాయి.