
దీపావళి వరకు ఆందోళనలు వద్దు: అభిజీత్
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) దీపావళి వరకు దేశవ్యాప్తంగా ఎలాంటి ఆందోళనలు చేపట్టబోదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. పండగలను కుటుంబాలతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని మద్దతుదారులకు సూచించారు. మరోవైపు, ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో దసరా సందర్భంగా రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తుతో పాటు 30 అడుగుల బొద్దింక దిష్టిబొమ్మను కూడా దహనం చేయనున్నారు. దీనిపై స్పందించిన దీప్కే.. తమ పార్టీకి ఉచితంగా ప్రచారం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.




