తెలంగాణలో పెరిగిన కరెంట్ బిల్లులు

0చూసినవారు
తెలంగాణలో పెరిగిన కరెంట్ బిల్లులు
తెలంగాణలో విద్యుత్‌ వినియోగదారులపై రూ.5,420.23 కోట్ల ట్రూ అప్‌ ఛార్జీల భారం పడనుంది. నవంబర్‌ నెలలో యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్‌ నుంచి 50 పైసల చొప్పున అదనంగా వసూలు చేయనున్నట్టు సమాచారం. టీజీఎస్‌పీడీసీఎల్‌కు 29 నెలలు, టీజీఎన్‌పీడీసీఎల్‌కు 26 నెలల పాటు ఈ ఛార్జీలు వసూలు చేసేందుకు అనుమతి లభించింది. దీంతో 100 యూనిట్ల వినియోగానికి నవంబర్‌లో రూ.30, డిసెంబర్‌ నుంచి రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో విద్యుత్‌ ఛార్జీల పెంపు వినియోగదారులపై మరింత భారం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్